NTV Telugu Site icon

Delhi: టెన్షన్.. టెన్షన్.. ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

Bomb

Bomb

బాంబు పేలుళ్ల బెదిరింపుతో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. స్కూల్ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని పిల్లలను వెనక్కి పంపించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాఠశాల ఆవరణలో తనిఖీలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి పేలుడు పదార్థాన్ని కనుగొన్నట్లు ధృవీకరించబడలేదు. కానీ.. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇమెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాఠశాలల్లో నిఘా పెంచారు. దాదాపు 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

READ MORE: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

కాగా.. దేశ రాజధానిలో నవంబర్ 28న పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీసింది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. 28న ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపుచేశాయి. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.

READ MORE: Pushpa 2 : యూ ట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప 2.. షాక్ అవుతున్న జనాలు