Site icon NTV Telugu

DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్‌ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్!

Dpl 2025

Dpl 2025

DPL 2025: ఆదివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రసవత్తరమైన ఫైనల్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పై లయన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఆజేయంగా చేసిన 79 పరుగులు ప్రధాన కారణమయ్యాయి.

Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత!

174 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన లయన్స్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. సిమర్జీత్ సింగ్, అరుణ్ పుందీర్ ల దాడికి 5వ ఓవరులోపే 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ రాణా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మయాంక్ గుసైన్‌తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యం చేస్తూ జట్టును తిరిగి బాట పట్టించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో హృతిక్ షోకీన్ 27 బంతులలో 42 పరుగులతో కలసి రాణా అద్భుతంగా ఆడారు. ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును లక్ష్యానికి చేర్చారు. రాణా అవసరమైన బౌండరీలు, స్ట్రైక్ రొటేషన్‌ తో స్కోరును వేగంగా పెంచగా, షోకీన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

Tollywood : కోడల్ని కూతురిలా చూసుకున్న..వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య తల్లి ఎమోషనల్ కామెంట్స్

ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ టాప్ ఆర్డర్ విఫలమైంది. వరుస వికెట్లతో 78 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో యుగల్ సైనీ 48 బంతులలో 65 పరుగులు, ప్రాంశు విజయరన్ 24 బంతులలో 50 పరుగులు చేసి ఇద్దరూ ఏడవ వికెట్ కు భారీ భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు. వీరిద్దరి 78 పరుగుల భాగస్వామ్యం కారణంగా కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

Exit mobile version