Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..

  • రామ్‌ హీరోగా.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.
  • ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల.
  • కేవలం దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్ల భారీ ధర.
Double Ismart

Double Ismart

Double Ismart Digital rights For South Indian Languages: రామ్‌ హీరోగా.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక మూవీలో మాస్‌, యాక్షన్‌, డ్రామా, ఎంటర్‌టైన్మెంట్‌.. మొదటి పార్ట్ కంటే డబుల్‌ డోస్‌ లో కచ్చితంగా ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి జగన్నాద్. ఇక ఈ సినిమా సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ను “అమెజాన్ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ ” అధినేతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. అదికూడా భారీ ధరను వెచ్చించి.

Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?

‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌దత్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించగా.. కావ్య థాపర్‌ హీరోయిన్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మాతలుగా ఉన్నారు. ఇకపోతే., తాజాగా కేవలం దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్ల భారీ ధరకు అమ్ముడ బోయినట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. దింతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకులలో మరింత పెరిగాయి. మరోవైపు ఇదే రోజున మాస్ మహారాజ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చుడాలిమరి ఎవరు ఎంతటి విజయాన్ని సాధిస్తారో.

Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..