NTV Telugu Site icon

Tamil Nadu Politics: బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య దోస్తాన్ కటీఫ్..!

Tn Bjp

Tn Bjp

తమిళనాడు రాజకీయాలు నిత్యం రసవత్తరంగానే కొనసాగుతుంటాయి. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకే తమిళ ప్రజల మద్దతుగా నిలుస్తారు. జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకేకు మిత్రపక్షంగానే ఉంటోంది.. మరోవైపు జయలలిత చనిపోయిన తర్వాత నుంచి అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం.. ఈ రెండు పార్టీల మధ్య సంబంధాన్ని చెడగొట్టే పరిస్థితికి వచ్చింది.

Also Read : Bhagwat Kishanrao Karad: యువ భారతదేశం అభివృద్ధి చెందాలన్నదే మోడీ ఆశయం

వాస్తవానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై అటు డీఎంకే.. ఇటు అన్నాడీఎంకేతో కూడా టచ్ లోనే ఉన్నారు. అయితే ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు అన్నాడీఎంకే నాయకులకు ఆగ్రహం తెప్పించాయి. జయలలిత అక్రమాస్తుల అంశం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రధాన కారణం. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు గురించి అన్నామలై మాట్లాడుతూ.. బీజేపీతో జయలలిత కేవలం సన్నిహిత సంబంధాల వరకే పరిమితమయ్యారని, పొత్తు పెట్టుకోలేదని ఆయన చెప్పారు.

Also Read : Suresh Raina: మళ్లీ క్రికెట్ ఆడనున్న సురేష్ రైనా.. ఆ లీగ్ లోకి ఎంట్రీ..!

ద్రవిడ రాజకీయాల్లో ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ సెట్ కాదని జయలలిత భావించేవారని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చెప్పారు. జయలలిత హయాంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అక్రమాస్తుల కేసులో జయ జైలుకు కూడా వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేతలు సీరియస్ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, రాష్ట్ర రాజకీయాలకు అన్నామలై పనికిరారని అన్నారు. అన్నామలై ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. అన్నాడీఎంకేతో పొత్తు వద్దని అన్నామలై అనుకుంటున్నాట్లు తాము భావిస్తున్నామని జయకుమార్ చెప్పుకొచ్చారు.

Also Read : KTR Tweet: ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం.. కేటీఆర్‌ ట్విట్‌ వైరల్

అన్నామలైను హద్దుల్లో ఉంచకపోతే బీజేపీతో పొత్తుపై తాము పునరాలోచించుకోవాల్సి వస్తుందని జయకుమార్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి ఒక్క సీటు కూడా రాకూడదని అన్నామలై భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవినీతిపై వచ్చిన ఆరోపణలపై అన్నామలై ఎందుకు రియాక్ట్ కాలేదని అడిగారు. తమిళనాడులో బీజేపీకి నాలుగు అసెంబ్లీ సీట్లు తమ పార్టీ వల్లే వచ్చాయని చెప్పారు. తమ పార్టీతో పొత్తులో ఉంటేనే రాష్ట్రంలో బీజేపీకి గుర్తింపు ఉంటుందని అన్నారు. పొత్తు ధర్మాన్ని అన్నామలై పాటించాలని… లేకపోతే పొత్తుపై తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జయకుమార్ హెచ్చరించారు.