Site icon NTV Telugu

DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..

Dost 2024

Dost 2024

దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు జరిగింది. మొదటి విడతలో 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఫేస్ 1 లో 65 వేల 191 మంది విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అందులో 60 వేల 436 మంది సీట్లు పొందారు. ఈ సారి కూడా కామర్స్ కే డిగ్రీలో గిరాకీ పెరిగింది. కామర్స్ లో 21 వేల 758 సీట్లు భర్తీ అయ్యాయి. లైఫ్ సైన్సెస్ లో 11 వేల 5 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఫిజికల్ సైన్సెస్ లో 15 వేల 249, ఆర్ట్స్ లో 5 వేల 986 మందికి సీట్లు వచ్చాయి. కాగా.. దోస్త్ లో 805 కాలేజీలు, 457 కోర్సులు అందులో 3,71,096 సీట్లు ఉన్నాయి. కానీ.. అందులో 74 కాలేజీలకు సున్నా సీట్లు రావడం గమనార్హం..

READ MORE: Shashi Tharoor: ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రం..

కాగా.. మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్లు మే 3 నుంచి 21 వరకు సాగాయి. మే 10 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. మే 29న మొదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇక రెండో ఫేజ్‌ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్‌ 8 వరకు కొనసాగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్‌ 13న సెకండ్ ఫేస్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో ఫేజ్‌ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు, జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేస్‌లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్‌ 30 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి

READ MORE: Hyderabad : ఇక నో టెన్షన్.. ప్రతి జోన్‌లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్..!

Exit mobile version