Site icon NTV Telugu

AI Anchors: 50 భాషలలో ఏఐ యాంకర్లు రాబోతున్నారా.. డీడీ కిసాన్ వెల్లడి..

Ai Anchors

Ai Anchors

తాజాగా దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రత్యేకంగా మొదలు పెట్టిన ఛానెల్ “డిడి కిసాన్”. 2024 మే 26తో 9 వసంతాలని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ (AI) యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీరిని న్యూస్ చదివెందుకు ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు దూరదర్శన్ వెల్లడించింది. దీనితో దేశంలో ఏఐ యాంకర్లు రాబోతున్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ గా పేరు తెచ్చుకోనుంది.

Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..

ఈ ఏఐ యాంకర్లు పూర్తిగా ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని., ఇవి అచ్చం మనుషుల్లాగే పనిచేస్తాయని డీడీ కిసాన్ తెలిపింది. ఏఐ యాంకర్లు అనేక విభాగాలలో అంటే.. వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్‌లో ధరలు, ప్రభుత్వ పథకాలు , వాతావరణ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ ఏఐ యాంకర్లు మొత్తం 50 భాషల్లో మాట్లాడగలరని డీడీ కిసాన్ తెలిపింది.

6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్​..

ఈ వార్తా యాంకర్లు మానవుల మాదిరిగానే పని చేయగలవు. ఇవి 24 గంటలు, 365 రోజులు ఆగకుండా లేదా అలసిపోకుండా వార్తలను చదవగలరని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Exit mobile version