Gill-Sara Dating: డోంట్ వర్రీ బేబీ.. సారా టెండూల్కర్ ట్వీట్ వైరల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Don’t Worry Baby, Sara Tendulkar Wishes to Shubman Gill: భారత బ్యాటర్ శుభమన్ గిల్ గత కొంతకాలంగా ఆటతోనే కాదు డేటింగ్ రూమర్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓసారి సారా టెండూల్కర్‌తో, మరోసారి సారా అలీ ఖాన్‌తో కలిసి గిల్ ఉన్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవడంతో.. ఈ ఇద్దరిలో ఎవరితో డేటింగ్ చేస్తున్నాడనే క్లారిటీ లేదు. ఈ వార్తలపై ఈ ముగ్గురూ కూడా స్పందించలేదు. అయితే ఇటీవల ట్వీట్స్ చూస్తే.. గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుకోకుండా ఉండలేరు.
శుభ్‌మన్ గిల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య 70 వేలకు తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జయ్యాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా మ్యాచ్‌కు దూరమయిన అతడు నేడు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం లేదు. ఇక శనివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశముంది.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
శుభ్‌మన్ గిల్ డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుని జట్టులోకి తిరిగి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. గిల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘డోంట్ వర్రీ బేబీ.. నువ్ బలంగా తిరిగొస్తావ్’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. తాజా ట్వీట్ నేపథ్యంలో గిల్-సారా మధ్య ప్రేమాయణం నిజమేనని నెటిజన్లు అనుకుంటున్నారు.
Also Read: Israel–Hamas war: హమాస్ ఆర్థిక మంత్రిని చంపిన ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్..
శుభ్‌మన్ గిల్ బర్త్ డే సందర్భంగా సారా టెండూల్కర్ ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 6న కూడా ఓ పోస్ట్ చేశారు. డెంగ్యూ నుంచి గిల్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే సారా చేసిన ట్వీట్ ఫేక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందుకు కారణం.. సారాకు అసలు ట్విటర్ అకౌంటే లేదని గతంలో సచిన్ టెండూల్కర్ చెప్పారు. దీంతో సారా ఈ ట్వీట్ చేసిందా? లేదా?.. గిల్-సారా మధ్య ప్రేమాయణం నిజమేనా? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
Don’t worry baby you’ll come back stronger 💕#ShubmanGill pic.twitter.com/I5mznpRgWM
— Sara Tendulkar (@isara_tendulkar) October 10, 2023
తాజావార్తలు
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!