తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను వెల్లడించారు. తన కోసం ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సాధారణ ట్రాఫిక్ లోకి తన కాన్వాయ్‌ను అనుమతించాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి జనరల్ ట్రాఫిక్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తీసుకెళ్లేలా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
CM Revanth Reddy: నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Cm Revanthreddy