NTV Telugu Site icon

Donald Trump: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానంటున్న డోనాల్డ్ ట్రంప్‌

Donald Trump

Donald Trump

Donald Trump On Russia-Ukraine Issue: అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 2025లో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఈ శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రెమ్లిన్ చర్చల కోసం దాని స్వంత నిబంధనలను సెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పుతిన్ తన సైన్యం నిరంతరం ముందుకు సాగుతున్నందున ఒప్పందం కోసం ఇప్పటికే కఠినమైన షరతులు విధించినట్లు ఆయన చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతంలో చాలా వరకు తమ నియంత్రణను కలిగి ఉన్నందున ఈ మధ్య కాలంలో తీవ్ర ట్యాంక్ యుద్ధాల మధ్య ఉక్రెయిన్ భద్రత బలహీనపడింది.

Read Also: India At COP29: గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే ప్రణాళికను వెల్లడించిన భారత్.. దేశాల ముందు 2030 వరకు ఎజెండా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే , తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానని ఇదివరకే పలుమార్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని పొడగించవద్దని కోరినట్లు సమాచారం. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం డోనాల్డ్ ట్రంప్‌ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇందులో ట్రంప్‌కు చెందిన ముఖ్య సలహాదారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపికైన హిందూ-అమెరికన్ తులసీ గబ్బార్డ్‌ను ప్రశంసించారు.

Read Also: Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు.. శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం..

Show comments