NTV Telugu Site icon

Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోరు.. తొలి విజయం

Donald Trump

Donald Trump

US Presidential Election: అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్‌ తొలి విజయం దక్కింది. అయోవాలో నిన్న (సోమవారం) జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను గెలిచాడు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు దూసుకుపోయాడు. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్‌లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారబోతుంది.

Read Also: Sudeep: ఎన్టీఆర్ ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ… కన్నడ సూపర్ స్టార్ కాంప్లిమెంట్స్

అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం ఉంది. కావునా, మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌ పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. అయితే, అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ కు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు దక్కించుకున్నారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందిన వారు. అయితే, వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఇక, మూడోసారి తన అదృష్టాన్ని డొనాల్డ్ ట్రంప్ పరీక్షించుకోనున్నారు.