Donald Trump: యుద్ధం తెచ్చిన ఊహించని ముప్పు.. ట్రంప్ సామ్రాజ్యం కూలిపోనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి సొంత దేశంలో అధ్వనంగా మారుతోంది. ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలు, ఆయన ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలకు కారణమయ్యాయి. ఇరాన్ యుద్ధ క్షేత్రంలో పరిస్థితి తన అదుపులోనే ఉందని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఆయన సొంత ప్రభుత్వంలోనే అశాంతి తీవ్రమైంది. ఇరాన్‌లో ‘రిజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) తీసుకురావాలని కలలుగన్న ట్రంప్‌కు, ఇప్పుడు తన సొంత ప్రభుత్వంలోనే అస్థిరత సెగ తగులుతోంది. ఇటీవల అటార్నీ జనరల్ పామ్ బాండిని తొలగించారు. తాజాగా వైట్ హౌస్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ తన క్యాబినెట్‌లో మార్పులు చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ట్రంప్‌కు సొంత మంత్రి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలవ్వడమే దీనికి కారణమట.
READ MORE: Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
Also Read
- WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఉత్కంఠ..
- School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
- Vaibhav Sooryavanshi: "ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు".. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
- 8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
వాస్తవానికి.. ఈ యుద్ధం దాదాపు ఐదు వారాలుగా కొనసాగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు అమెరికా ప్రజలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఐదు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం అమెరికా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ట్రంప్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. ఇటీవలి సర్వే ప్రకారం.. ట్రంప్ ఆమోద రేటింగ్ కేవలం 36 శాతానికి పడిపోయింది. వైట్ హౌస్‌లోనూ పరిస్థితి దిగజారుతోందట. ట్రంప్ ఇటీవల జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని భావించారు. కానీ దాని ప్రభావం బలహీనంగానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ప్రస్తుతం ట్రంప్ ఆగ్రహం నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, మరియు కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్‌లపై ఉన్నట్లు సమాచారం. గబ్బార్డ్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ట్రంప్, ఆమె స్థానంలో మరొకరిని వెతికే పనిలో పడ్డారు. అటు లుట్నిక్ పాత వివాదాలు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తన మొదటి విడత పాలనలో సిబ్బందిని తరచూ మార్చడం వల్ల విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్, ఇప్పుడు “టార్గెటెడ్ మార్పులు” (కీలక వ్యక్తులనే మార్చడం) ద్వారా ప్రభుత్వం చురుగ్గా ఉందనే సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ట్రంప్ అనవసరంగా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చి తన పదవిని తానే పొగుట్టుకోబుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.
READ MORE: Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
- Tags
తాజావార్తలు
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
-
WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఉత్కంఠ..
-
School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!