Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!

  • వాషింగ్టన్‌లో జరిగిన డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు
  • డోనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, JD వాన్స్ సురక్షితం
  • “Let the show go on” అంటూ ట్రంప్ స్పందన
  • సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై ట్రంప్ ప్రశంసలు
  • నిందితుడు అదుపులోకి తీసుకున్న అధికారులు
  • లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ణయాలకే లోబడి చర్యలు
  • "ట్రూత్ సోషల్"లో ట్రంప్ పోస్టు వైరల్..
Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మేలని ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సహా మరికొందరు నాయకులు, ఇంకా అతిధులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఘటన అనంతరం ట్రంప్ స్పందిస్తూ “షో కొనసాగాలి” (Let the show go on) అని వ్యాఖ్యానించారు. ఇక కాల్పుల సమయంలో భద్రతా సిబ్బంది వేగంగా, ధైర్యంగా స్పందించారని ఆయన ప్రశంసించారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, అయితే తదుపరి చర్యల విషయంలో పూర్తిగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ణయాలకే లోబడి ఉంటామని స్పష్టం చేశారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్ సోషల్” లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఈ సంఘటన అనూహ్యంగా మారిందని, ప్రణాళికల ప్రకారం కార్యక్రమం సాగలేదని పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ ఈవెంట్‌ను మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. మరో పోస్టులో భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే ప్రాంగణం విడిచిపెట్టాలని అధికారుల సూచన మేరకు తాము బయటకు వెళ్లినట్లు వెల్లడించారు.