NTV Telugu Site icon

Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్.. లైంగిక ఒప్పందం కేసులో నేరారోపణల ధృవీకరణ!

Trump

Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న డానాల్డ్ ట్రంప్ కు ఊహించిన షాక్ తగిలింది. ఆయనపై నేరారోపణలను దాదాపుగా ధృవీకరిస్తూ గురువారం ఆ దిశగా న్యూయార్క్ కోర్టు సంకేతాలు ఇచ్చింది. తద్వారా అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది.

Also Read : Astrology: మార్చి 31, శుక్రవారం దినఫలాలు

2016 ఎన్నికల సమయంలో ఓ పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం ( నాన్ డిజ్ క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్ పై ఉన్నాయి. ఈ తరుణంలో సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పోర్న్ స్టార్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రోఫైల్ కేసుగా దర్యాప్తు విచారణ జరిపాయి.

Also Read : IPL 2023: కెప్టెన్సీ మీట్ కు రోహిత్ డుమ్మా.. అభిమానుల్లో ఆందోళన..

చివరికి ఈ నెల మధ్యలో ఈ వ్యవహారాన్ని ఖండిస్తూనే తన అరెస్ట్ కు రంగం సిద్దమవుతోందని.. ఆందోళనలకు సిద్దం కావాలంటూ అనుచరులకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పిలుపు ఇచ్చాడు. ఈ తరుణంలో న్యూయార్క్ గ్రౌండ్ జ్యూరీ గురువారం నాడు డానాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేక ఆయనే లొంగిపోతారా.. కేవలం కోర్టు విచారణతో సరిపెడతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వైపు ఈ పరిణామాంపై ఆయన అధ్యక్ష పోటీపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : Lakshmi Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే లక్ష్మీ మీ ఇంట భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది

అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని(గెలిచారు), యూకే కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్ ( వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి ).. తదితర అభియోగాలను డొనాల్డ్ ట్రంప్ (76 ) ఎదుర్కొంటున్నారు. ఒకవేళ లైంగిక వేదింపుల కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ ఎదుర్కొన్న.. లేదంటే అరెస్ట్ అయిన.. ఆయన జీవితంలో అదొక మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.

Show comments