Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో నివసించిన ఇల్లును ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం.. ట్రంప్ తన బాల్యంలో ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే గడిపారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ $2.3 మిలియన్లు పలుకుతున్నట్లు సమాచారం.
READ ALSO: Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు..
ఈ ఇల్లు సాధారణ ఇల్లు కాదు. దీనిని 1940లలో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నిర్మించారు. ఆయన స్వయంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్. ఈ ఇంటిని ట్యూడర్ శైలిలో నిర్మించారు. ఇది నాగరిక జమైకా ఎస్టేట్స్ పరిసరాల్లో ఉంది. ఈ ఇంట్లోనే ట్రంప్ తన బాల్యంలో ఎక్కువ భాగం గడిపారు. అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత నెలకొంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని, అక్కడ అడవి పిల్లులు నివాసం ఏర్పరచుకున్నాయి. అదే సమయంలో ఈ ఇంటిని Airbnbకి అద్దెకు ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ అది విఫలమైంది. 2016లో అధ్యక్షుడు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఇంటి గురించి మాట్లాడారు. ఈ ఇల్లు శిథిలావస్థ పరిస్థితికి ఆయన విచారకరం వ్యక్తం చేశారు. తాను ఇక్కడ అద్భుతమైన బాల్యాన్ని గడిపానని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే మార్చిలో రియల్ ఎస్టేట్ డెవలపర్ టామీ లిన్ ఈ ఇంటిని కేవలం $835,000కి కొనుగోలు చేశాడు. అతను దాదాపు $500,000 ఖర్చు చేసి, ఈ పాత ఇంటికి ఆధునిక రూపాన్ని ఇచ్చాడు. గతంలో ఈ ఇంటిని మైఖేల్ డేవిస్ సొంతం చేసుకున్నాడు, ఆ సమయంలో ఆయన దీనిని పునరుద్ధరించాడు. అయితే టామీ లిన్ ఈ పురాతన ఇంటికి పూర్తి కొత్తదనం తీసుకొచ్చాడు. పూర్తి పునరుద్ధరణ తర్వాత, ఈ ఇంట్లో ఇప్పుడు ఐదు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్రూమ్‌లు, అలాగే రెండు చిన్న బాత్రూమ్‌లను కలిగి ఉంది. అలాగే ఈ ఇంటి బేస్‌మెంట్ కూడా పునరుద్ధరించార. దానితో పాటు రెండు కార్ల గ్యారేజీ, బ్రాండ్-న్యూ, హై-ఎండ్ వంటగది ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇంటి ఖరీదు $2.3 మిలియన్ల అని అంచనా. ఒక్కసారిగా ఈ ఇంటికి ఇంత రేటు పలకడానికి మొదటి కారణం.. ఈ ఇల్లు ఒక విలాసవంతమైన ప్రాంతంలో ఉంది. రెండవది ఇది డోనాల్డ్ ట్రంప్ చిన్ననాటి ఇల్లు కాబట్టి. అందుకే దీని బ్రాండ్ విలువ ఇంతలా పెరుగుతుంది.
