Site icon NTV Telugu

Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థపై విషంకక్కిన ట్రంప్.. ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ..!

Trump

Trump

ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ను మిత్రదేశంగానే అభివర్ణిస్తూ.. విషంకక్కారు. మన దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా విమర్శలు గుప్పించారు. ఇండియా రష్యాతో స్నేహం కోరుకుంటోందని.. కానీ రష్యా లాగే “ఇండియన్ ఎకానమీ కూడా డెడ్ ఎకానమీ” అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం మద్దతు ఇచ్చారు.

READ MORE: YS Jagan: చంద్రబాబు కాలేజ్ రోజులను గుర్తుపెట్టుకుని.. ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారు!

ట్రంప్ వ్యాఖ్యపై గాంధీ మాట్లాడుతూ.. “అవును, ట్రంప్ చెప్పింది నిజమే. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి తప్ప ఇది అందరికీ తెలుసు. భారత్ ఎకానమి డెడ్ ఎకానమి అని అందరికీ తెలుసు. అధ్యక్షుడు ట్రంప్ ఈ వాస్తవాన్ని చెప్పినందుకు నేను సంతోషంగా ఉన్నాను. భారత ఆర్థిక వ్యవస్థ గురించి మొత్తం ప్రపంచానికి తెలుసు. అదానీకి సహాయం చేయడానికి బీజేపీ ఆర్థిక వ్యవస్థను అంతం చేసింది.” అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కోసమే పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థ, రక్షణ, విదేశాంగ విధానాన్ని నాశనం చేసిందని.. ఈ దేశాన్ని పతనం వైపునకు నెట్టేస్తున్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇండియన్ ఎకానమీ నాశనం కావడానికి ముఖ్యమైన 5 పాయింట్ల అంటూ వాటిని వివరించారు. డీమానిటైజేషన్, జీఎస్టీ, ఇండియాలో తయారీ పేరున అసెంబుల్ చేయడం, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు (MSME) లను నాశనం చేయడం, రైతులను అణచివేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని ఆరోపించారు.

READ MORE: Venkitesh: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ విలన్ దొరికాడోచ్

Exit mobile version