Site icon NTV Telugu

Howling Dogs : కుక్కలు ఏడ్చినప్పుడు వాటికి ఆత్మలు కనపడుతాయా?

New Project

New Project

Howling Dogs : కుక్క అరుపులు ఎప్పుడైనా తీక్షణంగా విన్నారా? అవి బిగ్గరగా మొరిగితే ఏడుస్తున్నాయని అంటారు. కుక్కలు తరచుగా రాత్రిపూట అరుస్తూ ఉంటాయి. కుక్కలు మనుషులకు కనపడని ఆత్మలను చూసి ఏడుస్తున్నాయని చాలా మంది అనుకుంటారు. మూడ నమ్మకాల ప్రకారం కుక్క ఏడుస్తుందంటే ఏదో అపశకునం జరుగుతుందని భావిస్తారు. కుక్కలు ఇలా చేసినప్పుడు, ప్రజలు తరచుగా వాటిని తరిమికొడుతుంటారు. కుక్కలు మొరగడానికి ఒక కారణం ఏమిటంటే అవి రాత్రి సమయంలో అసహ్యకరమైన సంఘటనలను సూచిస్తాయి. కుక్కలు రాత్రి లేదా పగటిపూట రెండు సార్లు ఏడుస్తాయి. వాటి ఏడుపు శ్రేయస్కరం కాదు.

Read Also: Akshay Kumar: పఠాన్ తో ఇండస్ట్రీ కోలుకుందనేది అబద్దం… ‘సెల్ఫీ’ ఊహించని ట్విస్ట్

అంతే కాకుండా ఇంట్లో పెంపుడు కుక్క ఏడవడం లేదా కళ్లలో నుంచి నీళ్లు రావడం లేదా తినడం, తాగడం మానేస్తే ఇంట్లో ఇబ్బందులు తప్పవని కూడా నమ్ముతారు. నిజానికి, కుక్కలు తమ సహచరులకు సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఏడుస్తాయి. ఈ ప్రత్యేక స్వరం ద్వారా, కుక్కలు కొన్నిసార్లు తన స్థితిని తన సహచరులకు చెబుతుంది. దీని ద్వారా అవి తనున్న స్థానానికి సులభంగా చేరుకుంటాయని అలా అరుస్తాయి. లేదంటే.. కుక్కలు నొప్పిలో ఉన్నప్పుడు కూడా ఏడ్వవచ్చు. ఇది వాటి సమస్యలను వ్యక్తీకరించడానికి కుక్కలకున్న ప్రత్యేక మార్గం. సాధారణంగా, కుక్క అనేది మనుషులతో కలిసిపోవడానికి ఇష్టపడే జంతువు. వారికి ఒంటరితనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో లేదా బయట వీధిలో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అలా అరుస్తుంది. కుక్క గాయపడినా లేదా అస్వస్థత చెందినా, అది రాత్రిపూట ఏడవడం ప్రారంభిస్తుంది.

Read Also: Akshay Kumar: పఠాన్ తో ఇండస్ట్రీ కోలుకుందనేది అబద్దం… ‘సెల్ఫీ’ ఊహించని ట్విస్ట్

Exit mobile version