Site icon NTV Telugu

Viral Video: మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి వచ్చిన కుక్క.. (వీడియో)

Dog

Dog

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే, రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గ్రెనడాలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలోకి ఒక కుక్క రావడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Simhadri Appanna: సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం.. ఎన్టీవీ కథనంతో రంగంలోకి అధికారులు

జూలై 4 శుక్రవారం, టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఎక్కడి నుంచో ఓ కుక్క అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న కొంతమంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు ఆ కుక్కను చూసి భయపడ్డారు. అందరూ కలిసి కుక్కను వీలైనంత త్వరగా మైదానం నుంచి బయటకు పంపడానికి ప్రయత్నించారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ కుక్కను మైదానం నుంచి తరిమికొట్టారు. దీంతో మ్యాచ్ కొద్ది సేపు ఆగి మళ్ళీ ప్రారంభమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Telangana : ఆ డాక్టర్లకు శుభవార్త.. ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

కాగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో, ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. వెస్టిండీస్ తరపున అలెక్స్ కారీ 63 పరుగులు చేయగా, అల్జారి జోసెఫ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు మాత్రమే చేసింది. బ్రాండన్ కింగ్ జట్టు తరపున 75 పరుగులు చేయగా, జాన్ కాంప్‌బెల్ 40 పరుగులు చేశాడు.

Exit mobile version