NTV Telugu Site icon

MLC Kavitha: బీసీ కుల గణన వివరాలు బయటపెట్టే దమ్ము కాంగ్రెస్- బీజేపీలకు ఉందా..?

Kavitha

Kavitha

ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలకు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ కుల గనన వివరాలు బయటపెట్టే బయట పెట్టె దమ్ము ధైర్యం కాంగ్రెస్ బీజేపీ లకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. బీసీ కుల గణన, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. బీసీ బ్యాక్ లాగ్ పోస్ట్ లపై స్పష్టత ఇవ్వాలి.. పనికిరాని ప్రతిపక్షం కాగ్రెస్.. మాది కేసీఆర్ సర్కార్ కాదు బీసీల ప్రభుత్వం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Read Also: Meruga Nagarjuna: రాష్ట్ర చరిత్రలో సీఎం జగన్ పాలనను సువర్ణ అక్షరాలతో లిఖించాలి..

కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీసీ కులగణన చేపట్టడం లేదో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటుందని ఆమె ధ్వజమెత్తారు. దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా ఉండిపోయిందని కవిత మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినంత మంచి పనులు ఏ పార్టీ చేయలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని ఎందుకు తొలగించారన్నది ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చే ముందే ఆన్సర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Read Also: Azharuddin: అజారుద్దీన్ కు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట..

బీసీ అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హస్యస్పదంగా ఉందన్నారు. బీసీలను రాజకీయంగా మభ్యపెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని కవిత అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోగా.. ఈసారి అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చేస్తారు? బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదం మాత్రమే అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Show comments