Site icon NTV Telugu

Gaddar: గద్దర్‌ మరణానికి కారణం ఇదే.. వైద్యులు ఏం చెప్పారంటే?

Gaddar Death

Gaddar Death

Gaddar: ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని.. కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్‌ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం శరీరంలో అవయవాలు దెబ్బతినడంతో గద్దర్‌ ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

Also Read: Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం

ఇదిలా ఉండగా.. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు, వయోభారం కారణంగా అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్(77) కన్నుమూశారని అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు.ఆయన తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ జులై 20, 2023న ఆస్పత్రిలో చేరారని.. ఆగస్టు 3, 2023న బైపాస్ సర్జరీ చేయించుకున్నారని వైద్యులు వెల్లడించారు. దాని నుండి కోలుకున్నాడు. శస్త్రచికిత్స అనంతంరం ఆయన కోలుకున్నారని.. అయినప్పటికీ గతంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, దీంతో పాటు వయోభారం ఆయన ప్రాణాపాయానికి దారి తీసిందని వైద్యులు ప్రకటించారు.

Exit mobile version