Out Of Danger: హైదరాబాద్ పెద్దమ్మతల్లి గుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్ ను పేస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. శేజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నట్లు.. శేజల్ ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించిన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. మరికొద్దిసేపట్లో శేజెల్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేస్ అసుపత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు పేస్ ఆసుపత్రిలో శేజల్ నుండి జూబ్లీహిల్స్ పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేసారు. సూసైడ్ గల కారణాలపై వివరాలు సేకరించారు.
Read Also: Pooja Hegde: ఎయిర్ పోర్టులో బుట్టబొమ్మ హాట్ ట్రీట్.. తట్టుకోగలమా?
మరోవైపు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుజాత డిమాండ్ చేశారు. శేజల్ కి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. చిన్నయ పై లైంగిక దాడి ఆరోపణలు చేసిన శేజల్ సూసైడ్ అటెంబ్ట్ చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదని ఆమే ఆరోపించారు. నిండు ప్రాణం సూసైడ్ చేసుకోవడం అమానుషమని.. బాధితురాలికి తాము భరోసాగా ఉంటామని సుజాత తెలిపారు. మరోవైపు శేజల్ ను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ మహిళ నేతలను ఆసుపత్రి ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే తమను లోనికి అనుమతి ఇవ్వాలని.. శేజల్ కండిషన్ ఎలా ఉందో చెప్పాలని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదం చేసుకున్నారు.
