NTV Telugu Site icon

Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం

Doctor

Doctor

Viral : ‘ఆశ’ మనిషిని అభివృద్ధి పథంలో నడిపించే ముఖ్య శక్తుల్లో ఒకటి. ఈ కథనం క్యాన్సర్ తో బాధపడే ఆరేళ్ల చిన్నారి గురించి. అతడి పేరు మను.చిన్నారి చికిత్సకు సంబంధించిన ఆంకాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను కంటతడి పెట్టిస్తుంది. మను రాసిన కొన్ని హృదయాలను కదిలించే మాటలతో సంభాషణ ప్రారంభమవుతుంది.

‘డాక్టర్, నాకు గ్రేడ్ 4 క్యాన్సర్ ఉంది. ఇంకా 6 నెలలు మాత్రమే బతుకుతాను. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెప్పకండి‘. అని మొదటి ట్వీట్ మొదలవుతుంది. చిన్నారి నిస్వార్థమైన, అమాయకమైన అభ్యర్థనకు డాక్టర్ కుమార్ ఆశ్చర్యపోయాడు. అయితే, మరోవైపు అప్పటికే బాలుడి తల్లిదండ్రులు వైద్యుడిని అదే అభ్యర్థించారు.

‘దయచేసి చిన్నారిని చూడండి.. అతడికి మెరుగైన వైద్యం చేయండి.. కాకపోతే రోగనిర్ధారణ(క్యాన్సర్ అన్న విషయం)ను అతనికి చెప్పవద్దు’. నేను వారి అభ్యర్థనను అంగీకరిస్తూ తల ఊపాను. ‘మనును చికిత్స నిమిత్తం వీల్ చైర్ పై తీసుకొచ్చారు. నేను అతడిని చూశాను. అతను చిరునవ్వుతో, నమ్మకంగా, తెలివిగా కనిపించాడు’ అని డాక్టర్ కుమార్ ట్వీట్ చేశారు. అయితే, కుమార్ తన పరిస్థితి గురించి మను తల్లిదండ్రులకు చెప్పాడు.. తమ పిల్లవాడు కూడా తన పేరెంట్స్ కు ఈ విషయాన్ని చెప్పొద్దన్నాడన్న విషయం వివరించారు.

మను మెదడు ఎడమ వైపున గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ గ్రేడ్ 4తో బాధపడుతున్నట్లు కుమార్ పేర్కొన్నాడు. కానీ ధైర్యం తెచ్చుకుని ఆ చిన్నారి తన తల్లిదండ్రుల గురించి మరింత ఆందోళన చెందాడు. అతను డాక్టర్‌తో కొంత సమయం ఏకాంతంగా అడిగాడు.. అతని ప్రస్తుత దశను తన తల్లిదండ్రులకు వెల్లడించవద్దని కోరాడు.

‘తల్లిదండ్రులు బయట వేచి ఉండటానికి గది నుండి బయలుదేరిన తర్వాత, మను ఇలా అన్నాడు- ‘డా, నేను ఐప్యాడ్‌లో వ్యాధి గురించి మొత్తం చదివాను మరియు నేను ఇంకా 6 నెలలు మాత్రమే జీవిస్తానని నాకు తెలుసు, కానీ నేను దీన్ని నా తల్లిదండ్రులతో పంచుకోలేదు. వారు కలత చెందుతారు. వారు నన్ను చాలా ప్రేమిస్తారు. దయచేసి వారితో పంచుకోవద్దు’ అని ట్వీట్‌ చేశారు.

‘తల్లిదండ్రులు ఏడుస్తున్నారు.. వారు బరువెక్కిన హృదయంతో ఆస్పత్రినుంచి వెళ్లిపోయారు. దాదాపు 9 నెలల తర్వాత, ఆ జంట నన్ను చూడటానికి తిరిగి వచ్చినప్పుడు నేను ఈ సంఘటనను దాదాపు మర్చిపోయాను. ఒక్కసారిగా వారిని గుర్తించి మను ఆరోగ్యం గురించి ఆరా తీశాను’ అని డాక్టర్ పోస్ట్ చేశాడు.

ఆ సమయంలో డాక్టర్ కుమార్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ‘డాక్టర్, మేం మిమ్మల్ని కలిసిన తర్వాత మనుతో చాలా సరదాగా గడిపాము. అతను డిస్నీల్యాండ్‌ని సందర్శించాలనుకున్నాడు. వాడిని తీసుకెళ్లాం. ఉద్యోగం నుండి టెంపరరీ లీవ్ తీసుకున్నాం. మనుతోనే ఎక్కువ సమయాన్ని గడిపాము. మేము అతనిని ఒక నెల క్రితం కోల్పోయాం. వాడితో ఎనిమిది నెలలపాటు ఆనందకర సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు’ అని ట్వీట్ ముగించారు.

పోస్ట్‌కి 529k పైగా వీక్షణలు మరియు అనేక స్పందనలు వచ్చాయి. చిన్నారి చూపిన ధైర్యానికి జనం ఆశ్చర్యపోయారు. ఈ పోస్ట్ తమ హృదయాన్ని ఎంతగానో కలచివేసిందని పలువురు వ్యాఖ్యానించారు.

ఈ కథనం చదివాక మీ ఆలోచనలు ఏమిటి?

Show comments