NTV Telugu Site icon

Viral Video: రెప్పపాటులో గుండెపోటుతో కుప్పకూలాడు.. సీపీఆర్ చేసి నిమిషాల్లో.. వీడియో వైరల్

Heart Attack

Heart Attack

Doctor saves life: ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు విడుస్తు్న్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్‌) చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. అతను ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు.

New Covid Variant: భారత్‎లోకి కొత్త కోవిడ్ వేరియంట్.. గుజరాత్‎లో మొదటికేసు

ఆ సమయంలోనే అదృష్టవశాత్తు తదుపరి లేన్‌లో షాపింగ్ చేస్తున్న ఒక వైద్యుడు (ఆర్థోపెడిక్‌ సర్జన్) ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చి కార్డియో పల్మనరీ రిసిటేషన్‌ లేదా సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. సకాలంలో బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. ఘటనా స్థలంలో ఉన్న డాక్టర్ కుమారుడు రోహిత్‌ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 10 నిమిషాలకు పైగా ప్రక్రియ కొనసాగిందని డాక్టర్ కుమారుడు వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సకాలంలో ప్రాణాలు కాపాడిన వైద్యుడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. సకాలంలో వైద్యం చేసి మృత్యువు నుంచి కాపాడి అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.