Site icon NTV Telugu

Viral Video: ఈ డాక్టర్ కు బీపీ ఎక్కువా ఏంటీ?.. వైద్యం కోసం పోతే చెంప చెల్లుమనిపించిందిగా..

Doctor

Doctor

డాక్టర్లను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ఓ రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. ఇదే విధంగా ప్రవర్తించింది ఓ లేడీ డాక్టర్. ఓ వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే.. వైద్యం చేయాల్సింది పోయి ఆ వ్యక్తిపై మహిళా వైద్యురాలు దురుసుగా ప్రవర్తించింది. ఏకంగా చెంప చెల్లుమనిపించి తన కోపాన్ని వెల్లగక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. గుజరాత్లోని అహ్మదాబాద్ సోలా సివిల్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఇది చూసిన వారు ఏంటీ ఈ డాక్టర్ కు బీపీ ఎక్కువా అంటూ మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే?

Also Read:India – China: డ్రాగన్ దేశానికి నిద్రలేని రాత్రులను గిఫ్ట్‌గా ఇచ్చిన భారత్..

అక్టోబర్ 26న ఆషిక్ హరీబాయ్ చౌడ అనే వ్యక్తి తన కూతురు అనారోగ్యంతో బాధపడుతుండటంతో అహ్మదాబాద్ సోలా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఓ లేడీ డాక్టర్ ఫోన్ లో బిజీగా ఉండిపోయింది. అయితే తన కూతురుకు ఆరోగ్యం బాలేదని త్వరగా చూడాలని డాక్టర్ ను కోరాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఆ వైద్యురాలు అసహనానికి గురైంది. బాలికకు చికిత్స చేసేందుకు నిరాకరించింది. దీంతో వైద్యం ఎందుకు చేయరని ఆ వ్యక్తి ప్రశ్నించినందుకు అతనిపై విరుచుకుపడింది. కోపంతో ఊగిపోతూ అతనిపై దాడి చేసింది. చెంప మీద లాగిపెట్టి కొట్టింది.

Also Read:Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?

డాక్టర్ తీరుతో అక్కడున్నవారంత షాక్ అయ్యారు. నీ కూతురికి వైద్యం చేయనంటే చేయనని సదరు లేడీ డాక్టర్ తెగేసి చెప్పింది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో అహ్మదాబాద్ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఫిర్యాదు అందితే దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

Exit mobile version