Eye Twitching: కళ్లకలక ఎందుకు వస్తుందో తెలుసా..? ఈ ఇన్‌ఫెక్షన్ వస్తే పాటించాల్సినవి ఇవే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా కళ్ల కలకల కేసులు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్య ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమిటి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చాలా మంది అనుకుంటారు. కండ్ల కలకలు ఉన్నవారి కళ్లల్లోకి చూడడం వల్ల ఈ వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుంటారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదు. ఆ వ్యాధి కారక సూక్ష్మజీవులు ఎదుటి వ్యక్తికి చేతి ద్వారా, లేదా ఏదైనా వస్తువు ద్వారా మాత్రమే వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడే సమయంలో ఈ కంటి ఇన్‌ఫెక్షన్ అధికంగా వ్యాప్తి చెందుతుంది.
Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా స్కూల్స్ లో పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి, లేక గుంపుగా ఉన్న ప్రదేశాల్లో అధికంగా ఇది పాకుతుంది. అలర్జీ వల్ల కలిగేది ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగేది తక్కువ టైంలో తీవ్రమైన లక్షణాలను కల్గిస్తుంది. కానీ తేలికగా తగ్గిపోతుంది. అదే బ్యాక్టీరియా వల్ల కలిగేది కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కానీ, కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చూపు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.
Read Also: Health Tips : రాత్రి భోజనం మానేస్తున్నారా? ఆ సమస్య బారిన పడతారు..
ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం లాంటివి చేయకూడదు. శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్ వాడి కళ్లను క్లీన్ చేసుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టడం వల్ల లక్షణాల నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు వెంటనే వాటి వాడకం ఆపేసుకోవాలి. వైరస్ వల్ల కలిగే సమస్య సాధారణంగా ఒకటి రెండు వారాలలో నయమవుతుంది. బ్యాక్టీరియా వల్ల కలిగిన సమస్య అయితే, ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి, సరైన మందు సరైన మోతాదులో, తగినన్ని రోజులు తప్పకుండా వాడుకోవాలి.
Read Also: Hyderabad: హ్యాట్సాఫ్ ఖాకీలు..పేషంట్ ప్రాణాలను కాపాడిన పోలీసులు..
ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ సమస్య రాకుండా చేతులను తరుచుగా క్లీన్ చేసుకోవాలి. మళ్లీ మళ్లీ కళ్లను ముట్టుకోడం బంద్ చేయాలి. కళ్లద్దాలు వాడడం వల్ల కళ్లు ముట్టుకోవడం తగ్గి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం, స్విమ్మింగ్ పూల్స్ వాడడం వంటివి చేయకూడదు. కళ్ల కలకలు ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్ లేదా చద్దర్లు ఇతరులు యూజ్ చేయకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్‌కు పంపకుండా ఇంటి దగ్గర ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?