NTV Telugu Site icon

Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘లో సంపంగి పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

Sampangi

Sampangi

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఓ పాత్ర బాగా నచ్చేసింది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించింది ఎవరో ఇప్పటివరకూ టీమ్ ఎక్కడా చెప్పలేదు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ దెయ్యం ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సినిమాలో హీరోల పాత్రలకంటే దెయ్యం పాత్రం హైలెట్ గా నిలిచింది.. కాసేపు పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తే, కాసేపు తన వికృత చేష్టలతో కడుపుబ్బా నవ్వించింది.. అలానే చివరిలో ఎమోషనతో ఏడిపించింది కూడా. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో మెప్పించింది డ్యాన్సర్ మనీష్ కుమార్ అని తెలిసింది.. ఆయన ఒక క్లాసికల్ డ్యాన్సర్.. దెయ్యం పాత్రలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్ అందరిని బాగా ఆకట్టుకుంది..

ఈ సినిమా అతని యాక్టింగ్ బాగుంది దాంతో ఆ దెయ్యం ఎవరని జనాలు తెగ గుగూల్ చేస్తున్నారు.. ఈ సినిమా హిట్ టాక్ దూసుకుపోతుంది.. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఇక కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ కనిపించేది కాసేపే అయినా గ్లామర్ షో కురిపించారు.. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది.. అలాగే సన్నీ ఎమ్ ఆర్ చక్కటి సంగీతాన్ని అందించారు..

Show comments