దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను జూన్ నెలలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలై నెల రోజులు దాటింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను కేంద్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు
మీడియా నివేదికల ప్రకారం.. భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో 17వ విడత డబ్బును విడుదల చేసింది. ఈ క్రమంలోనే 18వ విడత నిధులు అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..
మరోవైపు.. ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే.. ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరు.
