NTV Telugu Site icon

No Parking: నో పార్కింగ్‌కు ఫైన్లు కట్టి విసిగిపోయిన కార్ యాజమాని ఏం చేసాడో తెలుసా..!

Ar Parking

Ar Parking

నిత్యం ఫుల్ రద్దీగా ఉండే నగరాల్లో కార్ పార్కింగ్ స్థలాన్ని కనుగొనడం చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి ఎండ, వాన, దుమ్ములో కారుని రోడ్డు పక్కనే పార్క్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే తరచూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుండటంతో ఫైన్ చెల్లించాల్సి వస్తుంటుంది. అలాగే తైవాన్‌లో ఓ వ్యక్తి ఇలా జరిమానా కట్టి కట్టి చివరికి అతను చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Box Office Report: థియేటర్లలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఆదిపురుష్

తైవాన్‌లోని తైచుంగ్‌లో ఒక సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్‌లను తన ఫ్లాట్ పైకప్పుపై పార్క్ చేసాడు. తైచుంగ్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్‌లోని డోంగువాంగ్ 2వ వీధిలో ఈ ఘటన జరిగింది. నో పార్కింగ్‌కు సంబంధించి చాలాసార్లు జరిమానా విధించడంతో తన కార్లను ఇంటిపైకి ఎక్కించేందుకు క్రేన్‌ను అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నారు. ఇంటి పై కప్పుపై కార్లను పార్క్ చేయడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాన్ టెర్రస్ పైన మరొక వ్యాన్ టెర్రస్ సగం గోడకు అనుకోని ఉంచారు. దీంతో ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు.

Also Read: Astrology: జూన్‌ 18, ఆదివారం దినఫలాలు

మున్సిపల్ అధికారులు వాహనాలను పైకప్పుపై నుంచి వాహనాలను దించాలని సదరు ఇంజనీర్ ను అధికారులు కోరారు. కానీ అతను ఎటువంటి చట్టాలను ఉల్లంఘించడం లేదని చెప్పాడు. నివేదికల ప్రకారం, ఇది భవనంపై ప్రభావం చూపదని ఇంకా గొడవ చేయవద్దని యజమాని మున్సిపల్ అధికారులకు చెప్పారు. భవనం ఉక్కు ఇంకా కాంక్రీటుతో నిర్మించబడింది.. కాబట్టి ఇది రెండు వాహనాల బరువుకు మోస్తుందని కార్ల యజమాని అన్నారు. అయితే.. అతను ఈ కార్లను సమన్లు నిల్వ చేయడానికి గోడౌన్‌గా కూడా ఉపయోగిస్తున్నాడు. కార్ యజమాని చట్టాన్ని ఉల్లంఘించలేదని గుర్తించామని, అయితే ప్రజల భద్రత కోసం వాహనాలను ఇంటి నుండి తరలించాలని ఆదేశించామని అధికారులు తెలిపారు.