Site icon NTV Telugu

The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?

Whatsapp Image 2023 06 19 At 4.46.50 Pm

Whatsapp Image 2023 06 19 At 4.46.50 Pm

ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ను కూడా ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతును ఇస్తే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నో విమర్శలు చేసాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రదర్శనపై అక్కడక్కడా గొడవలు కూడా జరిగాయి.ఈ విధంగా ది కేరళ స్టోరీ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.. అయితే సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ సినిమా కి లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని సమాచారం.. ఇలా థియేటర్లలో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదల కోసం మూవీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.

థియేట్రికల్‌ రన్‌ ముగియడంతో జూన్‌ 23 నుంచి ది కేరళ స్టోరీ జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌ మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ది కేరళ స్టోరీ ను విపుల్ అమృతలాల్ షా నిర్మించిన విషయం తెలిసిందే.. సుదీప్తో సేన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని మరియు సోనియా బలాని వంటి వారు ఈ సినిమా లో కీలక పాత్రాలు పోషించారు. మరి థియేటర్లలో ది కేరళ స్టోరీ ను చూడటం మిస్‌ అయిన వారు అలాగే ఈ సినిమాను మళ్లీ చూడాలనుకునే వారు ఓటీటీ లో చూడటానికి బాగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version