సంపూర్ణ ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. ఎన్ని ఆస్థిపాస్తులున్నా ఒక్కసారి అనారోగ్యానికి గురైతే లైఫ్ నరకంగా మారుతుంది. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. టైమ్ కు తినడం, సరైన నిద్ర, వ్యాయామం, పౌషికాహారం, పాలు, పండ్లు మెరుగైన ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి. కాలాలను బట్టి కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే వ్యాధుల భారిన పడకుండా తప్పించుకోవచ్చు. చలికాలంలో పలు రకాల వ్యాధుల భారిన పడుతుంటారు. పుదీనా టీ తీసుకుంటే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వింటర్ లో పుదీనా టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీన టీ తాగితే మరింత హెల్తీగా ఉంటారు.
పుదీనా టీ ఒక ప్రసిద్ధమైన హెర్బల్ టీ. దీన్ని తాజా పుదీనా ఆకులతో తయారు చేస్తారు. పుదీనా టీ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. ప్రతిరోజు ఉదయం పుదీనా టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి దీని వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి.
US: జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు.. వీడియో వైరల్
పుదీనా ఆకుల నుంచి విడుదలయ్యే సహజ మెంథాల్ నూనె ఆవిరి.. తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల అలెర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పిప్పరమెంటులో ఉండే రోస్మరినిక్ యాసిడ్ తుమ్ములు, దురద, ముక్కు కారడం వంటి అలెర్జీ సమస్యలను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, గర్భవతులు వైద్యుల సలహా మేరకు పుదీనా టీ తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.