ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంపై ఉగ్రదాడి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న మోడీ నేడు రెండు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. కాగా.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ ప్రయాణించే విమానం సాధారణ విమానం కాదు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ విమానం ఎంత ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: Kingdom Teaser : అలసట లేని భీకర యుద్ధం.. ఎన్టీఆర్ మాటల్లో దేవరకొండ సినిమా టీజర్
ప్రధాని మోడీ ప్రయాణించే విమానం పేరు ఇండియా వన్. దీనిని ఎయిర్ ఇండియా వన్ అని కూడా పిలుస్తారు. ఈ విమానాన్ని బోయింగ్ కంపెనీ తయారు చేసింది. 2020 సంవత్సరంలో బోయింగ్ 777 మోడల్‌కు చెందిన రెండు ప్రత్యేక విమానాలను తయారు చేసి భారతదేశానికి ఇచ్చింది. ఈ విమానాలు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన విమానాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రధాని మోడీతో పాటు, రాష్ట్రపతి కూడా ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి వీవీఐపీలు ప్రయాణించే ‘ఎయిర్ ఇండియా వన్’ గంటకు దాదాపు 900 కిలోమీటర్ల వేగంతో గాల్లో ఎగురుతుంది. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. ఈ విమానం ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే.. 17 గంటలు ఎగరగలదు. ఇంతే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో ఈ విమానానికి గాలిలోనే ఇంధనం నింపుకోవచ్చు.
READ MORE: World’s Most Corrupt Country: ప్రపంచంలో అత్యంత “అవినీతి” దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే.?
ఈ విమానం లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్ (LAIRCM) టెక్నాలజీపై పనిచేస్తుంది. ఏ క్షిపణి కూడా ఈ విమానానికి హాని కలిగించదు. దాని అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను ఎవరూ హ్యాక్ చేయలేరు. ఇందులో అప్రోచ్ హెచ్చరిక వ్యవస్థ ఉంటుంది. విమాన పైలట్ క్లిష్టపరిస్థితుల్లో ఇతరులపై దాడి చేయవచ్చు. ఈ విమానం లోపలి భాగం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విమానంలో కాన్ఫరెన్స్ రూమ్, బెడ్ రూమ్, VVIP ప్యాసింజర్ రూమ్, మెడికల్ సెంటర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీన్ని భారత వైమానిక దళ పైలట్లు నడుపుతారు. కాగా… ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాలలో ఒకటి. బోయింగ్ నుంచి భారతదేశం కొనుగోలు చేసిన రెండు విమానాల ధర రూ.8,458 కోట్లుగా చెబుతున్నారు. అంటే ఒక విమానం ఖరీదు రూ.4229 కోట్లు.