Site icon NTV Telugu

Coolie : కూలీ కోసం ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో తెలుసా?

Coolie (3)

Coolie (3)

తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్లకు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉన్నారు. ఇక్కడే కాదు.. సింగ్ పూర్‌లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలీడే కూడిన సెలవులు ఇచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు లేని కార్పొరేట్ బుకింగ్‌కు తెరలేపిన హీరోగా మారారు రజనీ. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయట. అంతేకాదు రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్ చేయని ఫీట్ సాధించాడు రజనీకాంత్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఇచ్చిందట సన్ పిక్చర్స్. ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి అనుకున్నదాని కన్నాహైక్ ఇచ్చిందట నిర్మాణ సంస్థ.

Also Read : Fahadh Faasil : షిఖావత్ సార్ కు ఏమైంది.. ట్రాక్ తప్పిన ఫహాద్ ఫజిల్ కెరీర్..

రజనీకాంత్ కాకుండా మిగిలిన యాక్టర్ల రెమ్యునరేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యాంటోగనిస్టుగా కనిపించబోతున్న నాగార్జునకు ముట్టింది కేవలం రూ. 10 కోట్లే. ఈయన కంటే జస్ట్ క్యామియో అప్పీరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ రూ. 20 కోట్లు చార్జ్ చేశాడట. ఇక కీ రోల్స్ చేస్తున్న ఉపేంద్ర, సత్యరాజ్ చెరో ఐదు కోట్లతో సరిపెట్టుసుకున్నారని తెలుస్తోంది. మోనికా అంటూ ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన సౌబిన్‌కు మాత్రం జస్ట్ కోటి రూపాయలే ఇచ్చినట్లు సమాచారం. రజనీ తర్వాత ఈ సినిమాను భుజాన మోస్తున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గట్టిగానే తీసుకుంటున్నారు. లోకీ మామ రూ. 50 కోట్లు చార్జ్ చేస్తే ఈ సినిమాతో అనిరుధ్‌ రెమ్యునరేషన్ అమాంతం పెరిగింది. ఏకంగా రూ. 15 క్రోర్ పుచ్చుకున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇక ఇందులో ప్రీతి క్యారెక్టర్ చేస్తున్న శృతికి ముట్టింది రూ. 4 కోట్టే. అయితే తన కన్నా మోనికా సాంగ్‌లో జస్ట్ ఫ్యూ మినిట్స్ మెరిసిన పూజాకు రూ. 3 కోట్లు ఇచ్చారట మేకర్స్. ఇదండీ భారీ బడ్జెట్ ‘కూలీ’ల జీతభత్యాల లిస్ట్.

Exit mobile version