Tea : మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. ఈ వ్యక్తులు రోజులో అనేక కప్పుల టీ తాగుతూనే ఉంటారు. అయితే, టీని ఇష్టపడే చాలా మంది దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే ఆనారోగ్యాల గురించి పట్టించుకోరు. అసలు ఈ టీని తాగితే ఏమవుతుంది.. ఎంత పరిమితిలో తీసుకోవాలో తప్పకుండా తెలుసుకోవాలి.
టీలో కెఫీన్, షుగర్ రెండూ ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. రోజుకి 5 నుంచి 10 కప్పుల టీ తాగుతున్నారంటే ఎక్కడో ఒక చోట మీరే పొరపాటు చేస్తున్నట్లే. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పాలి. టీ తాగడం వల్ల ఎటువంటి హాని లేదు. అందులోనూ ఈ పానీయం శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఇది మనల్ని రిఫ్రెష్ చేయడానికి, మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఇదంతా మనం ఒక పరిమితికి మించి టీ తాగితేనే. అంతకు మించితే.. అది మలబద్ధకం, గుండెల్లో మంట, ప్రేగులపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఎసిడిటీ, అధిక రక్తపోటు తదితర సమస్యలు అధికంగా టీని సేవించడం ద్వారా తలెత్తవచ్చు.
Read Also: Gujarat Marriage: గుజరాత్‌లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
భారతదేశంలో టీలో కలిపే చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఒక రోజులో అనేక కప్పుల టీ తాగడం వల్ల అంటే పాక్షికంగా ఎక్కువగా చక్కెర తీసుకోవడం పెరుగుతుంది. అలాంటప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మధుమేహానికి దారి తీయవచ్చు. ఎక్కువ చక్కెర తినడం వల్ల అది కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని చాలా మందికి తెలుసు. అలాంటి సమయంలో బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.
Read Also: BCCI : ఆస్ట్రేలియాతో వన్డేలకు టీం ఇండియా జట్టు ప్రకటన
టీలో కెఫీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. టీ తీసుకోని రోజుల్లో తలనొప్పిని ఎదుర్కోవచ్చు. టీ కూడా మగతను ప్రేరేపిస్తుంది. ఇది నిద్ర విధానాలను ప్రతికూలం చేస్తుంది. కాబట్టి అతిగా కాకుండా ఒక రోజులో 2-3 కప్పుల టీని త్రాగవచ్చు. అది కూడా పరిమిత మొత్తంలో చక్కెర వేసుకుని. ఈ అలవాటును అదుపు చేసుకోలేని వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.