NTV Telugu Site icon

Seven Days Jewellery: అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా మీకు..?!

Jew

Jew

పెద్దల కాలం నుండే తెలుగు సంప్రదాయంలో., గ్రహాలను అనుసరించి విశ్వసించే నగలు ధరించడం అనే ఆచారం ఉంది. ఈ సంప్రదాయంలో ఆభరణాల ద్వారా మనకి సంబంధించిన గ్రహాలను శాంతింపజేయవచ్చని నమ్మకం. వీటి వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదని వారి నమ్మకం. ఇకపోతే ఇటువంటి అభిప్రాయాలను సంశయవాదంతో విమర్శనాత్మక ఆలోచనతో ఆలోచించడం కూడా ముఖ్యమే. వారంలో 7 రోజులు అనగా.. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరిస్తారు. వీటినే ఏడు వారాల నగలు అని పిలుస్తారు.

ఇందులో భాగంగా మన జాతక ప్రకారం గ్రహాలకు అనుకూలముగా గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, కంఠహారములు, పాపిటబిల్ల, వంకీ, ఉంగరాలు లాంటి బంగారు నగలని ధరిస్తాము. ఇకపోతే అసలు ఆ రోజు ఆ ఆభరణాలను వేసుకొంటారో ఓసారి చూద్దాం.

Also Read: Cobra Snake: ఇదేం పైత్యం రా బాబు.. పాము నోటిని ఫెవిక్విక్‌ తో అతికించిన మహిళ..!

• ఆదివారము నాడు సూర్యుని కొరకు కెంపుల కమ్మలు, హారాలు.
• సోమవారము నాడు చంద్రుని కోసము ముత్యాల హారాలు, ముత్యాల గాజులు.
• మంగళవారము నాడు కుజుని కోసము పగడాల దండలు, పగడాల ఉంగరాలు.
• బుధవారము నాడు బుధుని కోసము పచ్చల పతకాలు, గాజులు.
• గురువారము నాడు బృహస్పతి కోసము పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు.
• శుక్రవారము నాడు శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక.
•శనివారము నాడు శని కోసము నీలమణి హారాలు

Also Read:Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!

ఇలా ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకి సంపూర్ణ అప్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభించేలా గ్రహాలు అనుకూలించి విజయాన్ని ప్రసాధిస్తాయని పెద్దల నమ్మకం.