DGP Orders: సాధారణ పోలీసు విధులకు మహిళా పోలీసులను వినియోగించొద్దు అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఈ మేరకు పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు.. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీసు ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!