US warning: వెనిజులా వెళ్లొద్దని పౌరులకు అమెరికా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికన్ వ్యతిరేక భావాల కారణంగా వెనిజులా దేశం వెళ్లొద్దని తన పౌరులకు అమెరికా హెచ్చరించింది. వెనిజులాను సందర్శించినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అత్యవసర సేవలు అందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉందని తెలిపింది. బందీలుగా చేసుకునే ప్రమాదం ఉందని.. వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సిఫార్సు చేసింది. తగు జాగ్రత్తలైతే తీసుకోవాలని పౌరులకు అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను జారీ చేసింది.
వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం తాము ఏమీ చేయలేమని అమెరికా ఉన్నతాధికారులు తేల్చిచెప్పేశారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో ‘ప్రూఫ్ ఆఫ్ లైఫ్’ ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియేనే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్ ఉద్దేశం. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ గుర్తుచేసింది.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!