Insect repellents: వర్షాకాలంలో దోమలు, కీటకాలు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
- వర్షాకాలంలో పురుగులు.. బొద్దింకలు.. చిన్న చిన్న కీటకాల సమస్య
- ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంటి లోపలకు కీటకాలు.. దోమలు.. ఈ చిట్కాలు పాటించడంతో మెరుగైన ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా పెరుగుతుంది. వర్షం పడ్డ వెంటనే పరిసరాల్లో నీరు నిలిచి బురదగా మారుతుంది. దీంతో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంటి లోపలకు వచ్చేస్తాయి. కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోకి పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూడండి. మామూలుగా ఇంటి బయట తెలుపు రంగు కాంతి వచ్చే బల్బులను వాడతాం. వాటికి పురుగులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. బదులుగా ఎరుపు రంగు లేదా పసుపు రంగు వెలుతురు నిచ్చే బల్బులను అమర్చండి. వీటికి పురుగులు అంతగా రావు. బయట వీలైనంత తక్కువ సేపు లైట్లు వేసి ఉంచండి. అలాగే వీలైతే మోషన్ డిటెక్టివ్ లైట్లు వాడండి. వీటివల్ల సగం సమస్య తగ్గుతుంది.
READ MORE: RBI: నిబంధనలు విస్మరించిన బ్యాంకు.. రూ.29.6 లక్షల జరినామా విధించిన ఆర్బీఐ
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
మన కదలిక ఉంటేనే ఇవి వెలుగుతాయి. తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి. సిట్రోనెల్లా ఒక గడ్డిజాతి మొక్క. దీనికి సహజంగానే పురుగులను వికర్షించే లక్షణం ఉంటుంది. కాబట్టి సిట్రోనెల్లా నూనెను చల్లడం వల్ల పురుగులు రాకుండా చేయొచ్చు. ఇది సులభంగానే లభ్యం అవుతుంది. లేదంటే సిట్రోనెల్లా వాసన ఉండే క్యాండిళ్లు ఇంట్లో వెలిగించినా వాసనకు పురుగులు రావు. ఇంట్లో లేదా కిచెన్‌లో కొన్ని సహజంగానే కీటకాలను తరిమికొట్టే మొక్కల్ని పెట్టుకోవాలి. తులసి, ల్యావెండర్, కలబంద, తులసి, నిమ్మగడ్డి, రోజ్మేరీ, పుదీనా.. లాంటి మొక్కల్ని ఒక మూలన పెట్టుకుంటే చిన్ని చిన్న దోమల్లాంటి కీటకాలు రావు. ఫ్లై వంటల మీద, పండ్లు, కూరగాయల మీద, డైనింగ్ టేబుల్ మీద పెట్టిన వస్తువుల మీద చిన్న చిన్న పురుగులు వచ్చి వాలుతుంటాయి. అలాంటప్పుడు మీద జాలి లాంటిది పెట్టొచ్చు. ఆన్‌లైన్ లో మెటల్ మెష్ బాస్కెట్లు, మెష్ క్యాప్ దొరుకుతాయి. వాటిని వాడితే ఏ ఇబ్బందీ ఉండదు.
READ MORE: Minister Satya Kumar Yadav: సీఎం చంద్రబాబుకు ఇంకా సమయం ఇవ్వాలి…
లైట్లకు కీటకాలు ఆకర్షించి ఎక్కువవుతాయి. కాబట్టి లైట్ల కింది నూనెలో ముంచి కాగితాన్ని లేదా న్యూస్ పేపర్ వేలాడదీయాలి లేదా అతికించాలి. దీంతో కొన్ని పురుగులు ఆ కాగితానికి అతుక్కుపోతాయి. పురుగులు ఎక్కువగా లేనప్పుడు, చాలా చిన్న చిన్న పురుగులతో ఇబ్బంది ఉంటే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. దోమలు, పురుగులు రాకుండా గది మూలల్లో కర్పూరం వెలగించొచ్చు. రెండు మూడు కర్పూరాలు ప్లేట్ లో పెట్టి వెలిగించి కనీసం పది నిమిషాలు అలా వదిలేయాలి. గది తలుపులు మూసి ఉంచాలి. దాంతో దోమలు కాస్త తగ్గుతాయి. దాంతో పాటే నీలగిరి నూనె, నిమ్మనూనె, ల్యావెండర్ నూనె, పెప్పర్ మింట్ నూనె సమస్య ఎక్కువున్న చోట స్ప్రే చేస్తే పురుగులు రావు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?