NTV Telugu Site icon

Ghost Dreams: కలలో దెయ్యాలు పీడిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. అదే కారణం.. ?

Dreams

Dreams

Ghost Dreams: అర్ధరాత్రి.. నడిరోడ్డుపై ఒక దెయ్యం.. మీ ముందుకు నడుచుకుంటూ వస్తుంది.. మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఆ దెయ్యం వేగంగా వచ్చి మీ మీదకు దూకింది. అంతే భయంతో సడెన్ గా బెడ్ లేచి కూర్చున్నారు. ముఖమంతా చెమటలు.. చుట్టూ చూస్తే అంతా నార్మల్ గా ఉంది.. కొద్దిసేపటికి అర్ధమయ్యింది.. అది కల అని. ఇలాంటి కలలు తరుచుగా అందరికి వస్తూ ఉంటాయి. ఇదొక్కటే ఉదాహరణ కాదు.. ఇంతకన్నా దారుణంగా వస్తూ ఉంటాయి కొందరికి.. కలలు నిజమవుతాయా.. ? అనేది అందరూ అడిగే ప్రశ్న. ప్రతి కల వారి భవిష్యత్తు సంఘటనల వైపు నడిపిస్తుందట. భవిష్యత్ లో జరగాల్సిన విషయాలను కొన్ని సంకేతాల రూపంలో ముందే హెచ్చరిస్తుంది అనేది చాలామంది నమ్ముతారు. అయితే ఎక్కువగా ఇలాంటి దెయ్యాలు కలలో కనిపించడానికి కారణం మాత్రం ఒకటే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీవితంపై భయం. రేపు ఏమవుతుందో అనే టెన్షన్ ఉన్నవారికే కలలో దెయ్యాలు కనిపిస్తాయట. అవును.. ఈ విషయాన్నీ డ్రీమ్స్ సైన్స్ ఒక బుక్ లో రాసుకొచ్చింది. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతిఒక్కరు దెయ్యం ఉందని నమ్ముతారు.

ఒకరికి రోజూ నిద్రలో దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం.. వారు జీవితంలో ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారని అర్ధం అంట. ఇక డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో దెయ్యాలు కనిపించడం అనేది చెడు సంకేతం. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు సంకేతం. మానసికంగా బలంగా లేరని అర్ధం. మానసికంగా ధృడంగా ఉన్నవారు .. జీవితంలో ఎన్నో సాధించాలని, ముందుకు వెళ్లాలని చూస్తూ ఉంటారు. అలాంటివారు నిద్ర పోయేముందు రేపు ఇంకా బెటర్ గా ఉండాలని మనసులో అనుకోని పడుకుంటారు. కానీ, మానసికంగా బలం లేనివారు రేపు ఏం జరుగుతుందో అనే భయంతో పడుకుంటారు. దానివలన వారి మనసులో ఉన్న భయం దెయ్యాల రూపంలో కలలోకి వస్తాయని డ్రీమ్ సైన్స్ చెప్తుంది. అంతేకాకుండా కొందరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు.. జీవితంలో ఏదైనా నచ్చింది కోల్పోయినప్పుడు, ఉద్యమ నుంచి ఒకే విషయం గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలా దెయ్యాలు కల్లోకి వస్తాయట. ఇక దెయ్యంతో మీరు పోరాడినట్లు కలలో కనిపిస్తే.. భవిష్యత్ లో మీరు సాధించే విజయానికి ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపే సంకేతమని చెప్తున్నారు. మీక్కూడా దెయ్యాలు కలలో కనిపిస్తున్నాయి అంటే జాగ్రత్త.మనోనిబ్బరంతో ఉండండి.. దెయ్యాలను తరిమికొట్టండి.. హాయిగా నిద్రపోండి.