DMK: తమిళ స్టార్ దళపతి విజయ్ ఆదివారం విల్లుపురంతో తన పార్టీ తమిళగ వెట్రి కజగం(వీటీకే) తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు, సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇదిలా ఉంటే, అప్పుడే అధికార డీఎంకే పార్టీ విజయ్‌పై విమర్శలు చేయడం ప్రారంభించింది. తమిళనాడు న్యాయశాఖ మత్రి ఎష్ రెగుపతి సోమవారం విజయ్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. టీవీకే పార్టీ ఏ-టీమ్, బీ-టీమ్ కాదు బీజేపీకి సీ-టీమ్. ద్రవిడ పాలన నమూనాను ప్రజల మనసు నుంచి తొలగించలేమని అన్నారు. టీవీకే మీటింగ్ బహిరంగ సభ కన్నా గ్రాండ్ ఫిల్మ్‌గా ఉందని ఎద్దేవా చేశారు.
Read Also: Mahesh Babu: శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. ఇక థియేటర్లకు సెక్యూరిటీ రెడీ చేసుకోండమ్మా!!
అంతకుముందు.. నటుడు విజయ్ విల్లుపురం సభలో మాట్లాడుతూ.. డీఎంకే ద్రావిడ మోడల్ ముసుగులో ప్రజలను మోసం చేస్తోందని, ప్రభుత్వం ప్రజావ్యతిరేకి అని విజయ్ ఆరోపించారు. విభజన రాజకీయాలతో ఈ దేశాన్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, వారే టీవీకే యొక్క మొదటి శత్రువు అని అన్నారు. తమిళనాడును ఒక కుటుంబం లూటీ చేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పార్టీని ప్రకటించినప్పటికీ, ఆదివారం తొలి బహిరంగ సభలో ప్రసంగించారు.