NTV Telugu Site icon

DK Aruna: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం!

Dk Aruna

Dk Aruna

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండా ఎగురవేయడం ఖాయం అని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పుర్తిగా మోసం చేశాడని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడని మండిపడ్డారు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది అని డీకే అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కామారెడ్డి జిల్లాలో డీకే అరుణ మాట్లాడారు.

Also Read: Gold Rate Today: వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

‘గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను అమలు చేయలేదు. ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పుర్తిగా విఫలం అయింది. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పుర్తిగా మోసం చేశాడు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా తయారు చేశాడు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది. ఎవరు ఊహించని విధంగా మధ్యతరగతి వారి కోసం అదాయ పన్నులో మినహాహింపు ఇచ్చింది పీఎం నరేంద్ర మోడీ. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటు. రాష్టంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది’ అని డీకే అరుణ చెప్పారు.