BJP National Vice President DK Aruna Criticized CM KCR.
తెలంగాణలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో నిర్వహించిన ప్రజా గోస – బీజేపీభరోసా యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అంతేకాకుండా.. ముఖం చెల్లకనే కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదని ఆమె మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఉద్దేశంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆమె వెల్లడించారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరేది కాంట్రాక్టు కోసం కాదని, మునుగోడు ప్రజలకు ఆశ పెట్టేందుకే కేసీఆర్57 సంవత్సరాల పెన్షన్ మోసమని ఆమె వ్యాఖ్యానించారు. తాండూర్ లో ఉన్న ఖనిజ సంపద వల్ల రాష్ట్రానికి భారీ ఆదాయం వెళ్తుందని, తాండూర్ లో అభివృద్ధి శూన్యమని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూర్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.