Site icon NTV Telugu

DK Aruna: మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తా.. డీకే అరుణ సీరియస్‌

Dk Aruna

Dk Aruna

DK Aruna: దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీరయస్ వార్నింగ్ ఇచ్చారు. మీడియా లో తాను కాంగ్రెస్ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తాను కాంగ్రెస్ పార్టీ లో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందన్నారు. మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని డీకే అరుణ అన్నారు. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!

తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని? ప్రశ్నించారు. కాంగ్రెస్ లో తన చేరిక పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తన పై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థల పై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో టీ కాంగ్రెస్ ఇలాంటి మైండ్ గేమ్స్‌కు పాల్పడుతుందన్నారు. బీజేపీ తనను గుర్తించే జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి కట్టబెట్టింది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి అదృష్టం ఉండాలన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. మొత్తంగా తను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న దుష్ప్రచారంపై ముందుగా ఖండించి పార్టీ మార్పుపై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టింది డీకే అరుణ.

Also Read : Jacqueline Fernandez : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న జాక్విలిన్…

Exit mobile version