NTV Telugu Site icon

DK Aruna : దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ

Dk Aruna

Dk Aruna

హైదరాబాద్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని ఆమె కొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ… ఇప్పుడు అధికారం లో ఉన్న పార్టీ నీ చూస్తున్నామని, రాష్ర్ట అభివృద్ది నీ కుంటుపడేలా చేస్తున్నారని, 2047 వరకు ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని లక్ష్యం తో మోడీ పని చేస్తున్నారన్నారు డీకే అరుణ. ఎందుకోసం తెలంగాణ కావాలని కోరుకున్నమో అది నెరవేరాలి అంటే బీజేపీ అధికారం లోకి రావడం అవసరమనన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలకు భిన్నంగా సిద్ధాంతం మీద ఏర్పడ్డ పార్టీ బీజేపీ….కేడర్ బేస్డ్ పార్టీ అని, నేషన్ ఫస్ట్, పార్టీ next, సెల్ఫ్ లాస్ట్ అనేది బీజేపీ కార్యకర్త విధానమన్నారు.

Mosquito Repellents: ఈ స్ప్రేలు కొడితే దోమల బెడద మాయం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

ఫ్యామిలీ ఫస్ట్ ఓరియెంటెడ్ పార్టీ కాంగ్రెస్ అని, విలువలతో రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా రాజకీయ నేతలు పార్టీ లు మారుతున్నారని, బీజేపీ యే రోజు కూడా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వలేదన్నారు డీకే అరుణ. 370 ఆర్టికల్ రద్దు , అయోధ్య లో రామ మందిరం నిర్మాణమని, ఉమ్మడి పౌర స్మృతి కూడా తీసుకొస్తుందన్నారు. అధికారం కోసం బీజేపీ పని చేయదు… దానికి నిదర్శనం వక్ఫ్ బిల్ ను తీసుకు రావడమేనని, బీజేపీ ఈ రోజు చేసే సభ్యత్వం రేపు తెలంగాణ లో అధికారం లోకి రావడానికి నాంది కావాలన్నారు. దేశం కోసం బీజేపీ లో చేరాలన్నారు డీకే అరుణ.

Vinakayaka Statues: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం.. ఏ జిల్లాలో ఉందంటే?

Show comments