ప్రస్తుతం వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. వాటి వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.
దోమల ను తరిమి కొట్టేందుకు కొన్ని రకాల స్ప్రేలు బాగా పనిచేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
రాత్రి పూట ఒక స్ప్రే డబ్బాలో కప్పుడు నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూను వేప నూనెను వేసి షేక్ చేస్తూ బాగా కలపాలి.
దాన్ని గది మూలల్లో, మంచాల కింద స్ప్రే చేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది.
టీ ట్రీ ఆయిల్ వాసనకు దోమలు దరి చేరవు. ఇంకా ఈ టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అరకప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో పది చుక్కల వరకు టీ ట్రీ ఆయిల్‌ని వేయండి. నీళ్లో ఈ మిశ్రమాన్ని కలిపి ఇల్లంతా స్ప్రే చేయండి.
లావెండర్ ఆయిల్, పెప్పర్‌మింట్ ఆయిల్, సిట్రోనెల్లా ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్... లాంటి ఎసెన్షియల్ నూనెల్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి.
అలాగే అర కప్పు వరకు కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ నూనెలో పది చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ని కలపి స్ప్రే సీసాలో పోసుకుని పెట్టుకోవాలి.
ఇది మనం చర్మంపై రాసుకోవచ్చు. మూలల్లో ఒక వస్త్రాన్ని ఉంచి దాని మీద స్ప్రే చేసి పెట్టుకోవచ్చు.
మార్కెట్‌లో లెమన్ యూకలిప్టస్ నూనె అనేది నేరుగా అందుబాటులో ఉంటుంది.
రాత్రి దీన్ని ఉపయోగించాలని అనుకున్నప్పుడు ఒక స్ప్రే బాటిల్లో కప్పుడు నీళ్లు పోసి, అందులో ఈ ఆయిల్‌ని వేసి మూలల్లో స్ప్రే చేయవచ్చు.