NTV Telugu Site icon

Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..

Muslim Womens

Muslim Womens

దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది. ముస్లిం మహిళలు తమ చేతులతో ఉర్దూలో శ్రీరాముడికి హారతి ఇచ్చారు. ‘హే రాజా రామ్ తేరీ ఆరతి ఉతారు’ అనే కీర్తన కూడా పాడారు. ఈ క్రమంలో.. వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. రాముని మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారు. ఈ సందర్భంగా ధర్మాచార్య మాట్లాడుతూ.. 2006లో వారణాసిలోని సంకట్‌ మోచన్‌ టెంపుల్‌ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందన్నారు. రామనవమి, దీపావళి రోజున ముస్లిం మహిళలు ఆచారాల ప్రకారం శ్రీరాముని ఆరతిని నిర్వహిస్తారని ధర్మాచార్య చెప్పారు. దేశంలోని ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, శాంతి సందేశాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం అని అన్నారు.

Read Also: Mallikarjun Kharge: జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు

ఇదిలా ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడి సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆ దేశాలకు సూచించారు. రాముడి మార్గాన్ని అర్థం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. రామరాజ్య దర్శనం ప్రజలందరినీ వివక్ష నుండి విముక్తి చేస్తుందని.. అందరినీ ఆలింగనం చేసుకోవడం గురించి మాట్లాడుతుందని ముస్లిం మహిళలు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి దేశాలు రాముడి బాటలో నడవాలన్నారు. ఏదేమైనాప్పటికీ, ఈ ముస్లిం మహిళలు శ్రీరాముడికి హారతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాముడు ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వారి హారతితో నిరూపించారు.

Read Also: Ganja: పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా.. 250 కేజీలు స్వాధీనం