Diwali Remedies 2023: దీపావళి రోజున రూపాయి నాణెంతో ఈ పరిహారం చేస్తే.. ప్రతి పనిలో విజయమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 Diwali Money Remedies with One Rupee: హిందూ మతంలో ‘దీపావళి’ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఐదు రోజుల పండుగ ధంతేరస్ నుంచి ప్రారంభమై భాయ్ దూజ్ రోజున ముగుస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంది. దీపావళి రోజు రాత్రి మహాలక్ష్మి భూమిని దర్శించుకుంటుంది. ఈ పరిస్థితిలో మహాలక్ష్మి ఆశీర్వాదం పొందడానికి దీపావళి రోజు రాత్రి కొన్ని పరిహారాలు చేయాలి. అవి మీ అదృష్టాన్ని మార్చగలవు.
దీపావళి రోజున ఒక్క రూపాయి నాణెంతో ఈ పరిహారం చేయండి:
దీపావళి రోజు చేసే చిన్న చిన్న చర్యలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు అందిస్తాయి. కానీ ఈ చర్యలు చేయడానికి సరైన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీపావళి రోజున లక్ష్మీదేవి మరియు గణేశుడిని పూజించే సమయంలో రూపాయి నాణెం కూడా పూజిస్తారు. అలా చేయడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది.
Also Read
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
# లక్ష్మీ దేవి పూజ సమయంలో ఆమె పాదాల వద్ద ఒక రూపాయి నాణెం ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నాణేన్ని రాత్రంతా ఇంటి మీద వెలుగుతున్న దీపం కింద ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నాణెం జాగ్రత్తగా భద్రపరచండి. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి పూజలో ఉంచిన ఒక రూపాయి నాణెం ఎరుపు రంగు దారంలో కట్టి మీ ఇంటిలో భద్రంగా ఉంచండి. దీనితో మీ సంపద పెరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
# దీపావళి రోజు రాత్రి ఆవనూనె దీపాంత కింద ఒక రూపాయి నాణెం ఉంచి.. ఆపై దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన ప్రతి పనిలో విజయం ఉంటుంది.
# దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి.. ఒక రూపాయి నాణెంను కుంకుమ , అక్షింతలు మరియు కల్వేపై ఉంచండి. పూజ తరువాత ఈ నాణెంను డబ్బు దాచే ప్రదేశంలో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
తాజావార్తలు
-
E30 Petrol: పెట్రోల్‌లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
-
Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
-
Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!