NTV Telugu Site icon

Divvela Madhuri: నాకు బతకాలని లేదు.. వాణి వేధింపులతో చనిపోవాలనుకుంటున్నా

Maduri

Maduri

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. మాధురి టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర జరిగింది.

100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..

పలాస ఆసుపత్రిలో దివ్వెల మాధురి వైద్యానికి నిరాకరించారు. తన మీద ఆరోపణలు చేస్తే తీసుకోగలను, కానీ తన పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేనని తెలిపారు. తనకు ఏ ట్రీట్ మెంట్ అక్కర్లేదు, తనకు బతకాలని లేదన్నారు. తాను చనిపోవాలనుకున్నా.. దువ్వాడ వాణి చేస్తున్న వేధింపులతోనే చనిపోవాలనుకుంటున్నని చెప్పారు. తనను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని వాణి ఆరోపిస్తుంది. ఈ ప్రమాదంలో తను చనిపోతే దువ్వాడ వాని పైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబుతోంది. హైవేపై సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరాను అంటూ దివ్వల మాధురి తెలిపింది.

Palnadu: పోటెత్తిన పర్యాటకులు.. ఎత్తిపోతల జలపాతం చూసేందుకు