హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనీ రోడ్ నంబర్ 5 ,ఇందిరా నగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులకు శుభవార్తను అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాము అని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వాళ్ళు.. మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
Also Read:Kingdom : కింగ్డమ్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. కారణం ఇదే
హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించాలని చూస్తున్నాంమని తెలిపారు.. Ev వెహికల్స్ అనుమతించబోతున్నాం.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించండి.. అభ్యర్ధుల ఎంపిక అధిష్టానం పరిధి లోనిది.. కానీ.. జూబ్లిహిల్స్ స్థానికులకే టికెట్ బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వం.. స్థానికుడికే టికెట్ బయట నుంచి టికెట్ ఆశించే వారికి టికెట్ ఇవ్వబోమన్నారు.. అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తుందంటూ.. జూబ్లీహిల్స్ అభ్యర్ధి ఎంపిక పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
