NTV Telugu Site icon

MLA Shankar Naik: శంకర్ నాయక్ మాకొద్దు.. సీఎం వద్దకు తీసుకెళ్తానన్న ఎమ్మెల్సీ

Shankar Naik

Shankar Naik

బీఆర్ఎస్‌ పార్టీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ కొనసాగుతుంది. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ మార్చాలని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు. మహబూబాబాద్‌లోని ఓ బీఈడీ కళాశాలలో ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు భేటీ అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పోటీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసేది లేదని ఈ మీటింగ్ లో వారు తీర్మానించారు. గత కొంత కాలంగా మహబూబాబాద్ బీఆర్ఎస్ క్యాండిడెట్ ను ఛేంజ్ చేయాలనే డిమాండ్ వస్తుంది.

Read Also: National Film Awards 2023 live updates: బెస్ట్ యాక్టర్ రేసులో దూసుకుపోతున్న అల్లు అర్జున్!

అయితే, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్‌తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్‌ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభ్యర్ధిని మార్చేలా చూస్తానని రవీందర్ రావు తన అనుచరులకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే, ఇదంతా ఆయన ఆడిస్తున్న డ్రామా అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు ఆరోపించారు.

Read Also: Rishi Sunak: నిబంధనలు ఉల్లంఘించిన రిషి సునాక్.. పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇదే

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో కొందరు ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా.. మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి ఆయా నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన చేసినప్పటి నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments