Site icon NTV Telugu

TG News: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు..

Mlas

Mlas

TG NEWS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తయింది.. స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు రిజర్వ్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల స్పీకర్ విచారణ ఇంకా పూర్తి కాలేదు.. రేపో, ఎల్లుండో కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ముందుకు రానున్నారు.

READ MORE: Madhavi Latha: రాజమౌళి దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు..

ఇదిలా ఉండగా.. ఈ నెల 17న తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. “మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి..” అని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు.

Exit mobile version