Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dispute Over Compensation For Land Acquisition In Warangal Mamnoor Airport Expansion

Mamnoor Airport: భూసేకరణకు తొలగని అడ్డంకులు.. పరిహారానికి ఒప్పుకొని రైతులు

Published Date :April 3, 2025 , 2:13 pm
By Kothuru Ram Kumar
  • మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ
  • పరిహారం విషయంలో రైతులు, అధికారులు మధ్య విభేదాలు
  • ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్
  • అధికారులు భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందించగలమని స్పష్టం.
Mamnoor Airport: భూసేకరణకు తొలగని అడ్డంకులు.. పరిహారానికి ఒప్పుకొని రైతులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mamnoor Airport: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పరిహారం విషయంలో రైతులు, అధికారులు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. అధికారులు భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందించగలమని స్పష్టం చేస్తున్నారు. దీనితో తమ భూములకు సరైన పరిహారం అందాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎకరానికి రూ. 2 కోట్లు చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం రైతులకు ఎకరానికి రూ. 60 లక్షలు మాత్రమే అందిస్తామని తేల్చి చెప్పారు. ఈ ధర గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ..

ఈ నేపథ్యంలో, రైతుల డిమాండ్‌పై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇచ్చారు. భూసేకరణ నిబంధనల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం మాత్రమే చెల్లిస్తామని, రైతుల డిమాండ్‌ను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వరంగల్ కలెక్టర్‌ను కలిసి చర్చించేందుకు ప్రయత్నించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూములను కోల్పోతున్న రైతులు వరంగల్ కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులతో చర్చలు జరిపారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్‌తో రైతుల సమావేశం జరిగింది. ఈ చర్చల్లో అధికారులు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం వివరాలను తెలియజేశారు.

రైతులు కోరిన పరిహారం చెల్లించడం సాధ్యపడదని అధికారులు తెలియజేయడంతో చర్చలు విజయవంతం కాలేదు. రెండు గంటలపాటు జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండానే ముగిశాయి. రైతులు మార్కెట్ రేటుకు తగ్గట్లుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం తన నిర్ణయంపై కట్టుబడి ఉంది. భూములను కోల్పోతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సమగ్రంగా ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Compensation Issue
  • Farmers Protest
  • Land acquisition
  • Mamnoor Airport
  • telangana government

తాజావార్తలు

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions